Ponguleti Srinivasa Reddy | జగిత్యాల మే 17: పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో భూభారతి సదస్సుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి, శాలువాలతో సన్మానించి పెన్షనర్స్ సమస్యలను విన్నవించారు.
పెండింగ్ డిఏలు, పెన్షనర్స్ కు రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఈహెచ్ఎస్ అమలు, సీపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు తదితర సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు కే.కృష్ణా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు, కే.సత్యనారాయణ, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్, మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.