Rural railway stations | ఓదెల, సెప్టెంబర్ 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి ప్రజానీకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ సోమవారం ఎంపీ వంశీకృష్ణకు వినతి పత్రాన్ని అందించారు. కొలనూరు, ఓదెల, పోత్కపల్లి రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఎంపీకి వివరించారు.
ఆయా స్టేషన్లో ప్లాట్ఫాములపై కూర్చుండడానికి బల్లలు, రాత్రి లైటింగ్ ఉండేటట్లు చూడాలని కోరారు. రైల్వే గేట్ల వద్ద ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు గేట్ల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేలా కృషి చేయాలని కోరారు. కొలనూర్ రైల్వే గేట్ సమీపంలో ఉన్న మోరిని చిన్న వాహనాలు వెళ్లే విధంగా అనుమతించేలా రైల్వే అధికారులకు సూచించాలన్నారు. ఈ మోరీ ఉపయోగంలోకి వస్తే చిన్న చిన్న వాహనాలు వెళ్లి కొంత ఇబ్బందులు తప్పుతాయని తెలియజేశారు.