Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 17 : హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సు ఆర్టీసీ బస్సు మొగిలిపాలెం, రేకొండ, బొమ్మనపల్లి మీదుగా హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన సామాజిక సంఘ సేవకుడు, అధ్యాపకుడు సాయిని శ్రీనివాస్ హైదరాబాదులో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
కరోనాకు ముందు హుస్నాబాద్ డిపో బస్సు మొగిలిపాలెం నుండి రేకొండ మీదుగా హైదరాబాద్ కు ఉదయం సాయంత్రం ఉండేదని, ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా బస్సు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు అనుకూలంగా నిరంతరం ప్రయాణికుల రద్దీతో ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదని ఎండీ నాగిరెడ్డికి వివరించారు. బస్సు పునరుద్ధరణ పై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్ తెలిపారు.