Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 26: గణతంత్ర వేడుకలను చిగురుమామిడి మండలంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు వీధులలో ర్యాలీగా బయలుదేరి దేశభక్తి గేయాలను ఆలపించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ రమేష్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎంఈఓ పావని, మండల రైతు వేదిక వద్ద ఏవో మల్లేశం, ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సేర్ఫ్) కార్యాలయం వద్ద ఇన్చార్జి ఏపీఎం శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆకవరం భవాని, సింగిల్ విండో కార్యాలయం వద్ద సీఈవో నర్సయ్య, డార్విన్ స్కూల్ వద్ద పాఠశాల కరస్పాండెంట్ సమ్మిరెడ్డి, ఇందుర్తిలో ఆక్స్ఫర్డ్ పాఠశాలలో కరస్పాండెంట్ అప్పాల సమ్మయ్య, బొమ్మనపల్లి విస్డం పాఠశాలలో కరస్పాండెంట్ సంపత్ జాతీయ జెండా ఎగరవేశారు.
చిగురుమామిడి బీఆర్ఎస్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, బస్టాండ్ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, సీపీఐ కార్యాలయం వద్ద మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం వద్ద మండల అధ్యక్షుడు గొల్లపల్లి సదాచారి, చిన్న ముల్కనూరు ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్ హార్జీత్ కౌర్, రేకొండ హాలిక్ సమజీవి కోపరేటీవ్ సొసైటీలో అధ్యక్షుడు మండల కొమురయ్య, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజా మోహినోద్దీన్, సింగిల్ విండో మాజీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు చిట్టి మల్ల రవీందర్, ఆకవరం శివ ప్రసాద్, పోటు మల్లారెడ్డి, పూల లచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సర్పంచ్ అసంతృప్తి…
చిగురుమామిడి రెవెన్యూ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణకు మండల కేంద్రానికి చెందిన స్థానిక సర్పంచ్ ఆకవరం భవానికి రెవిన్యూ కార్యాలయం నుండి ఆహ్వానం పంపలేదని సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తహసీల్దార్ రమేష్ వివరణ కోరగా తాము సిబ్బందితో ఆహ్వానం పంపించామని ఆహ్వాన బుక్ పై సర్పంచ్ సైతం సంతకం పెట్టిందని తహసీల్దార్ తెలిపారు. సర్పంచ్ ఆరోపణలు సరికావని అన్నారు.