Sarangapur | సారంగాపూర్, డిసెంబర్ 22: సారంగాపూర్ మండల కేంద్రం శివారులోని కెనాల్ కు రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు గండి పడడంతో సోమవారం గ్రామ సర్పంచ్ చేకూట అరుణ శేఖర్ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు భూమిపూజ చేసి మరమ్మతు పనులను చేపట్టారు.
మూడు, నాలుగు రోజుల్లో యాసంగి పంటకు కెనాల్ నీరు విడుదల చేయనుండడంతో రైతులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా కెనాల్ గండికి మరమ్మతులు చేపట్టారు. కెనాల్ కు గండి పడిన ప్రాంతంలో సిమెంట్, మెరంతో మరమ్మతులు చేపట్టి గండిని పూర్తిగా పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేకూట అరుణ శేఖర్, ఉప సర్పంచ్ లచ్చయ్య, పాలక వర్గ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.