Godavarikhani | కోల్ సి టీ, సెప్టెంబర్ 29: నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందించింది. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన కుడప పోచం అనే వ్యక్తి పక్షవాతం బారిన పడి అచేతన స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. నిరుపేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించుకునే స్తోమత లేక ఇంటి వద్దనే కదలలేని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నాడు.
ఇతని దీనస్థితి తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా స్పందించి మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాపన్న సహకారంతో సోమవారం బాధితుడి కుటుంబంకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులతోపాటు ఎయిర్ బెడ్ ను అందజేసి ఉదారతను చాటుకున్నారు. తన అనారోగ్య పరిస్థితి తెలుసుకొని చలించి సాయం అందించిన సంస్థ సభ్యులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రజియా, బాబుమియా, కుంట సది, మునక్క, బొల్లం మధుబాబు తదితరులు పాల్గొన్నారు.