Government land | చిగురుమామిడి, మే 3: మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందా.. లేదా.. అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు దరఖాస్తు చేసుకోగా మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని పరిశీలించినట్లు ఆర్డీవో మహేశ్వర్ తెలిపారు. వీరి వెంట మాజీ ఎంపీటీసీలు మిట్టపల్లి మల్లేశం, కత్తుల రమేష్, వివిధ పార్టీల నాయకులు తోట శ్రీనివాస్, పెండ్యాల సదానందం, చట్ల మొగిలి, వెంకటరాజం, ప్రవీణ్ కుమార్, రవి, రమేష్ తో పాటు ఐకెపి సిఏలు జ్యోతి, సుజాత, నిర్మల, జ్యోతి తదితరులు ఉన్నారు.