కరీంనగర్ కార్పొరేషన్, మే 22: ఓవైపు కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు మాత్రం తాము ఎలా సంపాదించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ ధ్వజమెత్తారు. రైతుల బాధలు మరిచి మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన మం త్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేకపోయారని దుయ్యబట్టారు. కరీంనగరంలోని ఓ ప్రైవేట్ హో టల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉన్నదని, దానిని ఎప్పుడు కొనుగోలు చేస్తారో..? ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సన్నబియ్యాన్ని మార్కెట్లో ఎక్కడా లేని విధంగా కిలో 57 పెట్టి కొనుగోలు చేస్తున్నారని, ఈ కొనుగోళ్లలో 300 కోట్లకు పైగా దండుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, కానీ ఇప్పటి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. ఈ టెండర్ పొడిగింపు పేరిట 700 కోట్లు దండుకోవాలని చూస్తున్నారని, టెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించవద్దని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీకి ఎంత మొత్తం ముట్టజెప్పాలన్న విషయంలోనే మంత్రు లు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఎంత సేపు తమకు వచ్చే కమీషన్లపైనే ద్యాస తప్ప రైతు ల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుం జపడుగు హరిప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు.