చొప్పదండి, మార్చి 17: శాంతియుతంగా నిరసనలు తెలిపితే అరెస్టులు చేయడం దారుణం. అధికార పార్టీ జగదీష్ రెడ్డి, కేటీఆర్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తే వారిని అడ్డుకోని పోలీసులు తాము ప్రతిపక్షంలో ఉండి శాంతియుతంగా నిరసనలు తెలిపితే మమ్ములను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం చొప్పదండి నియోజకవర్గం లోని తెలంగాణ చౌరస్తాలో కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రవీందర్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. శాంతియుతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై ఎన్ని కేసులు పెట్టిన తాను ప్రజల పక్షాన నిలుస్తూనే ఉంటామని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. అరెస్ట్ అయిన కార్యకర్తలను నాయకులను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అరెస్టు అయిన నాయకులను విడిపించారు.
ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అరెల్లి చద్రశేఖర్, గడ్డం చుక్కారెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ జెడ్పిటిసి మాచర్ల సౌజన్య- వినయ్ కుమార్ పట్టణ అధ్యక్షులు లోక రాజేశ్వర్ రెడ్డి, యువజన సంఘాల సమితి అధ్యక్షులు బంధారపు అజయ్ కుమార్, మారం యువరాజు యాదవ్, గన్ను శ్రీనివాస్ రెడ్డి, బిసవేణి రాజశేఖర్, సిపెల్లి గంగయ్య, ఎండి జహీర్, కొత్తూరి నరేష్, నరేష్ రావణ్, స్వామి, పంబాల రవితేజ, మొత్తం కుమార్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.