Recipt book missing | కొడిమ్యాల, జూన్ 03 : కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామంలో రశీద్ బుక్ మాయం పై గ్రామ కార్యదర్శి జ్యోతి ఎంపీఓ వెంకటేష్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . బాధితుడు, అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అలీమ్ వాళ్ల అమ్మ ఇటీవలే మృతి చెందింది. దీంతో గ్రామ పంచాయతీలో ఇల్లు తన పేరు మీద మార్చుకోవటానికి అలీమ్ దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో గ్రామ కారోబార్ మధు కలుగ చేసుకొని మార్పిడీకి రూ6 వేల వరకు ఖర్చు అవుతాయని చెప్పాడు. దీంతో రూ.6వేలు అలీమ్ మధు నంబరుకు ఫోన్ పే చేశాడు. కానీ రశీద్ లో మాత్రం రూ.3 వేలు రాసి ఇచ్చాడు. ఈ విషయం గ్రామ పంచాయితీ కార్యదర్శి జ్యోతి దృష్టికి రాగా గ్రామ పంచాయతీ లో రశీద్ బుక్ లను పరిశీలించింది. అలీమ్ కు ఇచ్చిన రసీద్ బుక్ గ్రామ పంచాయతీ లో లేకపోవడంతో మధు ను అడగగా తన వద్ద లేదు అని సమాధానం చెప్పాడు.
ఈ విషయమై గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయితీ లో 5 బుక్ లకు నాలుగు బుక్ లు మాత్రమే ఉన్నాయని, ఒక బుక్ కనిపించడం లేదని రాత పూర్వకంగా ఎంపీఓ వెంకటేష్ కు పిర్యాదు చేసింది. ఈ విషయం ఎంపీవోను వివరణ కోరగా పిర్యాదు వచ్చింది నిజమేనని తెలిపారు.
డబ్బులు ఇపించాలి : అలీమ్, పూడూర్
పూడూర్ గ్రామ పంచాయితీ కి ఇల్లు మార్పిడీకి పోతే కరోబార్ మధు రూ.6 వేలు తీసుకున్నాడు. కానీ రూ.మూడు వేల కే రశీద్ ఇచ్చాడు. పై అధికారులు విచారణ చేసి ఇల్లు మార్పిడీతో పాటు మిగతా డబ్బులు ఇప్పించాలి.