Sircilla | స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి..ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
Sircilla | సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు.
రాజన్న సిరిసిల్ల, మే 22( నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణం శాంతి నగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్ గౌడ్ (17), వేములవాడ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17 ), తన స్నేహితులతో కలిసి ఈతకోసం సిరిసిల్ల శివారులోని మానేరు వాగులోని నీటిగుంటలోకి దిగారు. ఈతరాకపోవడంతో మణికంఠ, హరి చరణ్ గౌడ్ నీట మునిగి గల్లంతయ్యారు.
భయాందోళనతో తోటి స్నేహితులు కేకలు వేసి స్థానికులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మణికంఠ, హరిచరణ్ గౌడ్‌లో మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు బాలురు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పరామర్శించి ఓదార్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు.

Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

