వేములవాడ, జూన్ 22: రాష్ట్ర సాధనలో త్యా గాలు చేసిన అమరులను నాలుగు కోట్ల ప్రజలు ప్రతి రోజు స్మరించుకుంటున్నారని, వారి త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం అమరవీరుల స్తూపం వద్ద మౌనం పాటించి, నివాళులర్పించి మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17తో నిజాం నుంచి విముక్తి పొందిన ఆంధ్రా పాలకుల కింద అన్ని విధాలా నష్టపోయామని చెప్పారు. వారి త్యాగాలతో సా ధించుకున్న తెలంగాణలో వారిని స్మరించుకుం టూ అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నా రు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి సాధించుకున్న రాష్ట్రంలో దేశంలో ఎకడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. పాలనా సౌ లభ్యం కోసం జిల్లాల ఏర్పాటులో భాగంగా రాజ న్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుం డా మంత్రి కేటీఆర్ సారథ్యంలో విద్యా హబ్‌గా జిల్లా మారిందని గుర్తు చేశారు.
జిల్లాలో మెడికల్, జేఎన్టీయూ, నర్సింగ్, వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆనాటి ఉద్యమ సమయంలో రాజీనామా చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు గొప్పగా అమరవీరులను స్మరించుకుంటున్న సందర్భంలో వారి త్యాగాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, కమిషనర్ అన్వేశ్, పార్టీ అధ్యక్షులు పులం రాజు, గోసుల రవి, మల్యాల దేవయ్య, కౌన్సిలర్లు మారం కుమార్, జెడల లక్ష్మి, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, యాచమనేని శ్రీనివాసరావు, బింగి మహేశ్, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, గోలి మహేశ్, కో ఆప్షన్ సభ్యులు బాబున్, నాయకులు పొలస నరేందర్, రామతీర్థపు రాజు , గడ్డం హన్మాండ్లు, సుధాకర్ రావు, గూడూరి మధు, భాసర్ రావు, వెంగల శ్రీకాంత్, నరాల దేవేందర్, వాసాల శ్రీనివాస్, నీరటి మల్లేశం, కొండ కనకయ్య, సలీం, ఆరే సత్యనారాయణ, పెంట బాబు,ధమ్మ భాసర్, టైలర్ శ్రీనివాస్, కృష్ణ మూర్తి, పీర్ మహమ్మద్ తదితరులు ఉన్నారు.