సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 28 : గ్రామ అభివృద్ధికి కృషి చేసి, ప్రజల మన్ననలు పొందాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు(Sarpanches) బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య సూచించారు. ఈ మేరకు ఆదివారం తంగళ్లపల్లి మండలం చీర్ల వంచలో పర్యటించారు. ఇటీవలే గెలుపొందిన చీర్లవంచ గ్రామ సర్పంచ్ వేల్పుల రేణుక- రాజు దంపతులను, ఉప సర్పంచ్ బిమరి లక్ష్మి, స్వామి దంపతులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయిని ప్రభాకర్ రావు , బీరెడ్డి రామచంద్రారెడ్డికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజబింకర్ రాజన్న , మండల బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అవధూత మహేందర్, కమలాకర్ రావు పాపారావు, గంగు సంపత్ , బి మరి దేవయ్య, మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు దుండ్రపల్లి వెంకటేష్ ,పార్టీ యూత్ నాయకులు నెల్లుట్ల మహేష్ ,శేఖర్ ,మధు ,శ్రీకాంత్ రమేష్ ,సామనపల్లి, మధు ,పవన్ పాల్గొన్నారు.