SIRICILLA | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 18: అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తే పోలీసులచే లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజల పక్షాన నిలదీస్తే పోలీసులచే లాఠీ ఛార్జ్ చేయించడం చాలా దుర్మార్గమైన చర్యని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీల్లో ఒకటి అమలు కాకపోవడం దురదృష్టమని అన్నారు, అలాగే నిన్న గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రొటో కాల్ పాటించలేదని బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజల పక్షాన అడుగుతుంటే దాడులు చేయడం కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతూ మీరు ఇచ్చిన హామీలను ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మట్ట శ్రీనివాస్, అనిల్, శ్రీకాంత్, గాజుల మహేష్, ముజ్జు రాకేష్, శ్రీనివాసరావు, నరేష్, వెంకటేష్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.