సిరిసిల్ల రూరల్, మార్చి 23: బీఆర్ఎస్(BRS) పార్టీ రజతోత్సవం పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచే శారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, ఈ సభకు తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గభింకార్ రాజన్న ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్య కర్తలు తరలి వెళ్లారు. మండల లో నుంచి సుమారు 200 మంది తరలి వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక వాహనాల్లో , జై కే సి అర్, జై జై కే టీ అర్ అంటూ నినాదాలు చేస్తూ సభకు పయన మయ్యారు. వీరిలో సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్, పడిగెల రాజు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, జిల్లా సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, వేణుగోపాల్ రావు, సత్తు రాంరెడ్డి, కర్నె బాలయ్య, తాటి పాముల శ్రీనివాస్ గౌడ్, మిట్టపల్లి జవహర్ రెడ్డి, మోతే మహేష్ యాదవ్, మళ్లారపు నరేష్, అబ్బడి తిరుపతి రెడ్డి, ఎల్లయ్య, దేవయ్య, జక్కుల రవీందర్, తదితరులు ఉన్నారు.