వేములవాడ రూరల్, జూన్ 22 : 40 ఏళ్ల ఆకాంక్ష త్వరలోనే నేరవేరబోతున్నదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో హన్మాజీపేట నక్కవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ 11.55 కోట్లు మంజూరయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పష్టం చేశారు. వేములవాడ సంగీత నిలయంలో ఎ మ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును గురువా రం హన్మాజీపేట, బొల్లారం, లింగంపల్లికి చెం దిన ప్రజాప్రతినిధులు కలిసి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో హన్మాజీపేట నక్కవాగుపై బిడ్జి నిర్మాణానికి నిధుల మంజూరుతో పాటు వేములవాడ, కో నరావుపేట, సిరికొండ, నిజమాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నా రు.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎంతో కృషి చేశామన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను పూ ర్తి చేస్తామన్నారు. డబుల్బెడ్రూం ఇండ్లతో పా టు గృహలక్ష్మి పథకం ద్వారా మరిన్ని ఇం డ్లను నిర్మించుకోవచ్చన్నారు. ఇంకా మిగిలిన్న రో డ్లు, బ్రిడ్జిలు వచ్చే రెండు నెలల్లో మం జూరు చేసుకుంటామని చెప్పారు. ప్రజాప్రతినిధులం చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరిస్తున్నామని, మొన్న జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా పెండింగ్ సమస్యలపై చర్చించుకొని అధిష్టానానికి సమస్యలను లిఖితపూర్వకంగా ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గంలో నిబద్ధతతో, సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ, పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారన్నారు. భవిష్యత్తు సవాళ్లకు దీటైన జవాబు ఏకైక పార్టీ బీఆర్ఎస్ మా త్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోస్కుల రవి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజు, హన్మాజీపేట సర్పంచ్ జింకె విజయ, బొల్లారం సర్పంచ్ సుద్దాల లచ్చ య్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఉపసర్పంచ్ మధు, సంతోష్, అంజి ఉన్నారు.