APK link | ఎల్లారెడ్డిపేట, జూలై 15 : గత కొన్ని రోజులుగా పీఎం కిసాన్ పేరిట ఓ ఏపీకే లింక్ వస్తుండగా తెలియక ఓపెన్ చేస్తున్న పాపానికి ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దుమాలకు చెందిన బాధితుడు పెరుమాండ్ల అంజయ్య తాను మోసపోయిన తీరును వివరించాడు. ఈ నెల 13న సాయంత్రం తనకు పరిచయం ఉన్న వ్యక్తి నుంచి తమ సంఘం గ్రూపులో పీఎం కిసాన్ ఏపీకే లింక్ వచ్చింది.
తమ సహచరులే పంపారనుకుని సదరు లింక్‌ను ఓపెన్ చేసి లింక్ అర్ధం కాకపోవడంతో బ్యాక్ వచ్చి అలాగే ఉంచాడు. లింక్ ఓపెన్ కాగానే సైబర్ నేరగాళ్లు 14వ తేదీ రాత్రి 2 గంటల నుంచి 3.30 వరకు ఖాతాలో ఉన్న సొమ్ములోంచి రూ.46 వేలు దఫదఫాలుగా విత్‌డ్రా చేశారు. అంజయ్య ఉదయం లేచి తన వాట్సాప్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా పోన్ పని చేయడం నిలిచిపోయి ఫోన్ వేడెక్కిపోయింది.
వెంటనే అర్థం కాక తన హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతా చెక్ చేసుకునే సరికి రూ.46 వేలు ఖాళీ కాగా సదరు బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశాడు. అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని డబ్బులు ఇక రావని అన్నట్లు ఆరోపించాడు. వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేసినప్పటికీ 2,3 గంటల సమయం తర్వాత రెస్పాండ్ అయి కేసు తీసుకున్నారని ఆవేదనగా తెలిపాడు.
అదే గ్రామంలో మరో బాధితుడు న్యాలకంటి సతీశ్ గతేడాది డిసెంబర్ 9న అదే తీరున లింక్ ఓపెన్ చేసిన వెంటనే రూ.96వేలు ఖాళీ చేశారని వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెల్లగా సరిగా స్పందించలేదని అన్నాడు. వెంటనే ఎస్పీ కార్యాలయంలోని పై అంతస్తులో ఉన్న సైబర్ క్రైం డిపార్ట్మెంట్కు వెళ్లి పిర్యాదు చేయగా వారి సహకారంతో రూ.62 వేలు రికవరీ అయినట్లు తెలిపాడు. తెలియని వారికి సరైన గైడెన్స్ పోలీసులు ఇవ్వడం లేదని దీంతో అమాయకంగా మోసమోతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతున్నదని తెలిపాడు. దుమాలలో మరికొంత మంది బాధితులు ఉండొచ్చని గ్రామస్థులు తెలిపారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి