వేములవాడ, మార్చి 4: నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తే ఉద్యమిస్తామని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా అంధకారం చేయాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఎందరో నిరుపేద విద్యార్థులకు వరంగా ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ పథకాని ఎత్తివేయాలి ఆలోచిస్తున్న విధానాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడపటం చేతకాకపోతే సీఎం పదవి నుండి దిగిపోవాలన్నారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ రీయంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల జోలికి వస్తే బీఆర్ఎస్వీ చూస్తూ ఊరుకోదుని రీయంబర్స్మెంట్ పథకానికి కొనసాగించే వరకు ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.