Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుంచి వేములవాడ వైపునకు వెళ్తుండగా.. రగుడు ఎల్లమ్మ గుడి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.
జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన మణిచరణ్ తమ బంధువుల పెళ్లి కార్డులను పంచడానికి వెళ్లి సిరిసిల్ల నుంచి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని రగుడుకు చెందిన బూర శశికుమార్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.