రాజన్న సిరిసిల్ల : వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘టెక్స్ టైల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ పిలుపు మేరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, మూడు రోజుల దీక్షలో భాగంగా తొలి రోజు దీక్షకు మున్సిపల్ చైర్ పర్సన్ జిందo కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందo చక్రపాణి తమ సంఘీభావం ప్రకటించారు.
కార్యక్రమంలో సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల కాటన్ వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల యారన్ అసోసియేషన్, సిరిసిల్ల డైయింగ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.