Tragedy | ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 9 : రోజూ లాగే బడికెళ్లి ఇంటికొచ్చే సరికి ఇంటి కొచ్చిన పిల్లలను లాలనగా చూసుకునే తల్లి కండ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన చిన్నారులు లే మమ్మీ అంటూ.. రోధించిన తీరు పలువురి కంట తడి పెట్టించింది.
స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. బొప్పాపూర్‌కు చెందిన ఈ ర వేణి పరశురాములు-రామవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు కృష్ణహరికి వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన రమ్యతో వివాహం జరుగగా, వారికి ముగ్గురు పిల్లలు లాస్య(5), ప్రణవ్(6), నిషాల్ (5) ఉన్నారు. కృష్ణహరి బతుకు దెరువు కోసం రెండేండ్ల క్రితం దుబాయ్ వెళ్లగా, ఇంటి వద్ద తన పిల్లతో కలిసి ఓ గదిలో ఉంటున్నది. అత్తామామలు, పెద్ద కుమారు డితో ఉంటున్నారు. ఈ క్రమంలో రమ్యకు అత్తామామలకు చిన్న పాటి ఘర్షణ జరుగగా మనస్థాపానికిలోనై ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ముగ్గురు పిల్లలు బడి ముగించుకొని ఇంటికి చేరుకునే సరికి తమ ఇంటికి తలుపు వేసి ఉండడంతో ఎంత పిలిచినా తల్లి స్పందించక పోవడంతో ఇరుగుపొ రుగు వారు తలుపులు పగులగొట్టి చూసే సరికి ఉరేసుకుని మృతి చెంది ఉంది. ఆటోలో ఉన్న మృతదేహాన్ని చూసిన చిన్నారులు లే మమ్మీ అంటూ రోధించిన తీరు పలువురి కంటతడి పెట్టించింది. ఎస్ఐ రాహుల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తు న్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.