రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని మిడ్ మానేరులో 6లక్షల ఉచిత చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గుక్కెడు మంచి నీళ్ల కోసం గోస పడ్డ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందని వివరించారు. తెలంగాణ దేశానికే ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోందన్నారు.
తెలంగాణ లో ఎక్కడా చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కండ్ల ముందు కనబడుతుతుందని వెల్లడించారు. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు.
సీఎం అన్ని కులవృత్తుల వారికి పెద్ద పీట వేస్తూ ఆర్థికంగా ఎదగటానికి ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వుట్కురి రమణా రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.