రాజన్న సిరిసిల్ల, జూలై 23 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తున్నది. అభివృద్ధి ప్రధాత, అపద్భాందవుడు రామన్న నూరేళ్లు వర్ధిల్లాలని సోమవారం జిల్లా అంతటా కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు సంబురాలు జరుపనున్నారు. సిరిసిల్ల పట్టణంలో పార్టీ అధ్యక్షుడు జిం దం చక్రపాణి ఆధ్వర్యంలో ఉదయం 9గంటలకు శివనగర్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైపాస్‌రోడ్డులో మొక్కలు నాటుతారు. 10.40 గంటలకు గాంధీచౌరస్తాలో కేక్ కట్ చేసిన అనంతరం జిల్లా ఏరియా దవాఖానలో పేషంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తారు.
అన్ని వార్డులలోని కౌన్సిలర్లు బర్త్‌డే వేడుకలు నిర్వహించనున్నారు. కాగా వేములవాడలో ఎమ్మె ల్యే రమేశ్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాదవి ఆధ్వర్యంలో చెక్కపల్లి రోడ్డు లో ఉదయం 10గంటలకు పెద్ద సంఖ్యలో మొక్క లు నాటనున్నారు. రాజన్న ఆలయంలో ప్రత్యే క పూజలు చేసి, కోడె మొక్కులు చెల్లిస్తారు. 48వ పుట్టిన రోజును పురస్కరించుకుని 48కేజీల కేక్ కట్ చేస్తారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద మొక్కలు నాటుతారు. ఇంకా ఆయాచోట్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు బర్త్‌డే వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.