కోనరావుపేట: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన ఏనుగుల నారాయణ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి కొడుకులు మోహన్, దేవరాజు, కూతురు మమత ఉన్నారు.
వీరందరికి వివాహాలు అయ్యాయి. ఈ క్రమంలో ఆస్తుల గురించి గత సంవత్సర కాలంగా తండ్రి, కొడుకులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నరసయ్య మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగింది.
దీంతో ఇంటి వద్ద ఉన్న స్తంభానికి కట్టేసి కొట్టగా నర్సయ్య మృతి చెందినట్లుగా తెలుస్తున్నది. ఇది హత్యా లేక ఇంట్లో కిందపడి మరణించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.