Siricilla | సిరిసిల్ల రూరల్, జూన్ 22: భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది. ఏకంగా ఎస్సై ఎదుటనే పురుగుల మందు తాగి అఘాయిత్యం కు పాల్పడడం మరోసారి పోలీసుల తీరుపై చర్చ నియాంశమైంది. ఇటీవల అంకుశపూర్ మాజీ ఎంపీటీసీ కర్క బోయిన కుంటయ్య ఆత్మహత్య ఘటన మరువక ముందే తంగళ్ళపల్లి లో భూ విషయంలో మరొకరు ఆత్మహత్యాయత్నంకు పాల్పడడం చర్చ నీ అంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. తంగళ్ళపల్లి మండలం చీర్లవంచకు చెందిన వేల్పుల కృష్ణ (52) వీఆర్ఏ గా పని చేసి, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు మారాడు. వేల్పుల కృష్ణకు గ్రామంలో 3.0 9 ఎకరాల భూమి ఉంది. పక్కనే ఉన్న తన అన్న బలరాం భూమి కూడా ఉన్నది. బలరాం గతంలోని చనిపోగా, గత కొన్ని రోజులుగా భూమి హద్దుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అన్న బలరాం చనిపోగా, వదిన సత్తవ్వ తో భూమి హద్దుల విషయంలో పలు పంచాయతీలు సైతం జరిగాయి. నేనే పద్యంలో ఈ నెల 15 న కృష్ణ వదిన సత్తవ్వ భూమి పంచాయతీ విషయంలో కృష్ణ ఇబ్బందుల గురి చేస్తున్నాడు అంటూ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి, పోలీస్ స్టేషన్కు రావాలంటూ కృష్ణ ను పిలిపించారు.
ఆదివారం కృష్ణ పోలీస్ స్టేషన్ కు రాగా, పోలీస్ స్టేషన్లో ఎస్సై రామ్మోహన్, కృష్ణ పై దురుసుగా వ్యవహరించాడు. నీ మీద కేస్ అయింది అంటూ ఎస్ఐ తెలపడంతో, ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని, సివిల్ మ్యాటర్ లో ఎలా కేసు చేస్తారు అంటూ కృష్ణ మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తో పాటు పలువురు అడ్డుకుని , సిరిసిల్ల దవఖానకు తరలించారు. ప్రస్తుతం కృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.