రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామాని చెందిన సద్దుల పూర్ణ ఇంటి వద్ద కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
ఉదయం లేచి చూసిన కుటుంబసభ్యులు దూడ మృతదేహాన్ని చూసి షాకయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ పరిసరాల్లో చిరుత తిరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర భాయందోళనలకు గురవుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని అటవీ సిబ్బందిని కోరుతున్నారు.