KTR | రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మార్కండేయ జయంత్యుత్సవాల్లో పాల్గొననున్నారు.
పద్మశాలీయుల ఆరాధ్య దైవమైన భక్త మార్కండేయ జయంతిని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. కన్నుల పండువగా పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేటీఆర్ హాజరు కావడం పట్ల పద్మశాలీయులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.