KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి సర్పంచ్ మాశెట్టి లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లచ్చయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
లచ్చయ్య అకాల మరణం బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఆయన మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. లచ్చయ్య కుటుంబసభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కాగా, కేటీఆర్ వెంట న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు , పార్టీ, గ్రామ నేతలు ఉన్నారు.

Ktr Chippalapally2