KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్న పల్లెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచ్చేస్తున్నారు. దత్తత గ్రామమైన రామన్నపల్లెలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండలాధ్యక్షుడు గజభీంకర్ రాజన్న, ఇతర బీఆర్ఎస్ నాయకులు విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు.
కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో రామన్నపల్లె గ్రామస్తులు మొత్తం తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికారు. దీంతో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామంలోని ఎల్లమ చెరువుకు వచ్చే వరద కాల్వను తవ్వించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ సైతం ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా నిలిపాడు. తాజాగా ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇవాళ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Ramannapalle1
చాలా రోజుల తర్వాత కేటీఆర్ గ్రామానికి వస్తుండటంతో రామన్నపల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేశారు.

Ramannapalle1

Ramannapalle2