KTR : ‘తెలంగాణ సత్తెమ్మ’కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) కన్నీటి నివాళులు అర్పించారు. సత్తెమ్మ కుటంబాన్ని ఓదార్చిన ఆయన.. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. తెలంగాణ ఉద్యమకారిణి, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త అయిన సత్తెమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. కరీంనగర్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన సత్తెమ్మ కేసీఆర్‌కు వీరాభిమాని. కేటీఆర్‌పై కూడా ఆమె ఎనలేని ప్రేమ, అభిమానం చూపించేవారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సత్తెమ్మ 2009 నుంచి కేటీఆర్ వెంటే నడిచింది. జిల్లాలో కేటీఆర్ పాల్గొన్న ప్రతి సభకు వచ్చి జై తెలంగాణ..జై కేసీఆర్.. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేసి సభకు వచ్చిన వారిలో ఉత్సాహం నింపేది. సత్తెమ్మ గ్రామం మాధ్య మానేరులో ముంపునకు గురైంది. దాంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో డబుల్ బెడ్ రూం ఇచ్చి కేటీఆర్ అండగా నిలిచారు.
అయితే.. కొడుకు మృతితో మనోవేదనకు గురైన సత్తెమ్మ అనారోగ్యం బారిన పడింది. కరీంనగర్‌లోని ఓ దవాఖానాలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సత్తెవ్వ ఇకలేరనే విషయం తెలియగానే.. బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు.గులాబీ పార్టీ అధినేతపై ఎనలేని అభిమానం చూపిన సత్తెమ్మ అంత్యక్రియల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆమె కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పిన ఆయన పాడె మోసి సత్తెమ్మకు నివాళులు అర్పించారు.
అనారోగ్యంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీమతి సత్తెమ్మ
వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ
సత్తమ్మ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన కేటీఆర్ pic.twitter.com/yGNpB7UCms
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2026