వేములవాడ రూరల్ మర్చి 6 : సమాజం ఆధునికంగా ముందుకు పోతుంటే ప్రజలు మానసిక, శారీరక సమస్యలకు పరిష్కారంగా భాణమతి, చేతబడి వంటివి నమ్ముతూ మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సంపతి రమేష్ అన్నారు. వేములవాడ మండలం, శభాష్ పల్లి గ్రామంలో ఇటీవల చేతబడి చేసి చంద్రగిరి మహేందర్-సాహితి వాళ్ల ఇంటి ఆవరణంలో తరుచూ పెట్టడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది జన విజ్ఞాన వేదిక జిల్లా బృందం దృష్టికి రావడంతో వారి ఇంటికి వెళ్లి దాన్ని తీసివేసి మూఢనమ్మకాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు మంత్రాల ద్వారా సమస్యలు తొలగిపోతాయని ప్రజలను నమ్మించి వారి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. కావున ప్రజలు ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజలు అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకోలన్నారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ప్యారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాబాలు, స్వాములు, మంత్రగాళ్లు చేసే మాయలు, మంత్రాలు సైన్స్ ముందు పని చేయవన్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాలో భానుమతి, చేతబడి చేసి ఆ వస్తువులను రోడ్ల కూడలీల వద్ద పెడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. కావున ప్రజలు వాటిని చూసి భయపడద్దన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహించే వారిని చట్టపరంగా శిక్షించాలన్నారు. ఇందులో జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు కమటం మల్లయ్య, రవి పాల్గొన్నారు.