రాజన్న-సిరిసిల్ల : ఓ ఇంట్లో నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన కోనరావుపేట మండలం కొండాపూర్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మల రాములు ఇంట్లో రాళ్లు పేల్చేందుకు నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాములు ఇల్లుతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.