BRS | సిరిసిల్ల రూరల్, మే 28: సిరిసిల్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ షొటో లేకుండా అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కాంగ్రెస్ నేతలు ప్రత్యక్ష దాడులు చేస్తామని ప్రెస్ మీట్ లు పెట్టి బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజ బింకార్ రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్ పాటించాలని అడిగితే, జంకుతున్నారాన్నారు.
ప్రొటోకాల్ పాటించని అధికారులు, ప్రభుత్వం ను ప్రశ్నిస్తామన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు , సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫొటో పెడతామని హంగామా చేశారన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి, బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేస్తూ లాఠీచార్జి చేశారని ఆరోపించారు. వారి దాడిలో బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రజలనుంచి కాంగ్రెస్ నాయకుల తీరుపై వ్యతిరేకత రావడంతో, కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యక్ష దాడులు చేస్తామని మాట్లాడడం సరైనది కాదన్నారు. అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి పెట్టి దాడులు చేస్తామంటే, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై చర్యలు ఉండవా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఫొటో కాల్ పాటించాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల అమలు చేయకుండా, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్థానిక అవసరాలకు ఇసుక ఇవ్వాలని నెల రోజుల క్రితమే అధికారులకు వినతి పత్రం అందించామన్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పి, హామీని విస్మరించారని పేర్కొన్నారు. తమ హయాంలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహరించలేదని, అందరిని కలుపుకొని పోయామని చెప్పారు. కాంగ్రెస్ నేతల గుండాల వ్యవహరిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు పదిమంది ఉంటే, తాము 100 మంది ఉన్నామని, పరస్పర దాడులు సరికాదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై తిరగబడుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టమంటున్న కాంగ్రెస్ నేతలు, తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లు, క్యాంప్ ఆఫీసులలో ఫొటోలు కూడా పెట్టుకోలెని నాయకులు ఉన్నారని, ముందుగా అక్కడ పెట్టుకునేలా చూసుకోవాలని హితువు పలికారు. రాహుల్ గాంధీ కార్యాలయంలో మోడీ ఫొటో ఉందా అని ప్రశ్నించారు.
ఈ సమావేశం లో మాజీ ఎంపీపీ పడి గెల మానస, వళ్లకొండ వేణుగోపాల్ రావు,పడి గెల రాజు, ఉమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, జక్కుల నాగరాజు యాదవ్, కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్, అవధూత మహేందర్, కర్నె బాలయ్య, కొయ్యడ రమేష్, బండి జగన్, సిలివే రీ చిరంజీవి, ఏ సి రెడ్డి రాంరెడ్డి, బండి దేవేందర్ యాదవ్, మోతే మహేష్ యాదవ్,కుర్మా రాజయ్య, గోడిసెల ఎల్లయ్య, అమర్ రావు, నవీన్ రెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, అమర్ రావు, విజయ్, కిష్టారెడ్డి, లక్ష్మారెడ్డి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.