వేములవాడ, మార్చి 4: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు ప్రాంగణంలో హోలీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య బుధవారం ఘనంగా జరిగాయి. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు రంగులతో ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రవీణ్, జ్యోతిర్మయి పాల్గొని అందరితో కలసి హోలీ సంబరాల్లో భాగమయ్యారు. పరస్పర స్నేహభావం, సౌహార్దాన్ని ప్రతిబింబించేలా వేడుకలు కొనసాగాయి.
న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
కోర్టు వాతావరణం రంగులతో కళకళలాడింది. ఈ కార్యక్రమంలో ఎజిపి బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, పురుషోత్తం,పర్లపెల్లి అంజయ్య, గుండ రవి, కిషోర్ రావు, నక్క దివాకర్,అనిల్ కుమార్, జనార్ధన్, వేముల గంగాధర్, మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ, బూర సరిత, మమత, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.