Sircilla |రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టయిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు బీఆర్ఎస్ నేతలు గాయపడ్డారు.
బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడినప్పటికీ బీఆర్ఎస్ నేతలు నిరసనలు ఆపలేదు. బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తలెత్తడంతో జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే, డీఎస్పీ నాగేంద్రచారి బీజేపీ నేతలను అడ్డుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక బీఆర్ఎస్ నేతలను సముదాయించి పంపించారు.

Sircilla3

Sircilla1
సిరిసిల్లలో బీజేపీ శ్రేణుల గూండాయిజం
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన బీజేపీ శ్రేణులు అరెస్ట్
బండి సంజయ్‌ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగిన బీజేపీ గూండాలు
రెండు రోజుల క్రితం… pic.twitter.com/BWjvtWqQhX
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2026