Vemulawada | వేములవాడ టౌన్, ఆగస్టు 19 : వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోని శ్రీ పార్వతి అమ్మవారి కోసం సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను తయారు చేశారు. ఈ పట్టు చీరను మంగళవారం నాడు ఆలయ ఇంచార్జి ఈవో రాధాబాయికి అందజేశారు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇలా పార్వతి అమ్మవారికి పట్టుచీరను సమర్పిస్తుంటానని నల్ల విజయ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.