రాజన్న సిరిసిల్ల ఏప్రిల్1( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యథావిధిగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని రైతులు కోరారు. ఈ మేరకు కలెకర్ట్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ నగేశ్‌లకు పెద్దూరు రైతులు, స్థానిక కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, దొంతినేని కల్యాణి అశోక్‌రావు వినతిపత్రం అందజేశారు.
వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభమవుతాయని అధికారుల దృష్టికి వారు తీసుకొచ్చారు. వడ్ల కొనుగోలు చేయడానికి పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సంఘం పెద్దూరు సొసైటీకి మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో రైతులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతులను కూడా కలెక్టర్, అదనపు కలెక్టర్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు జిల కిషన్ యాదవ్, ఉలిసె తిరుపతి, నారాయణ గౌడ్, దేవయ్య, రైతులు ఉన్నారు.