గంభీరావుపేట : కాంగ్రెస్ పాలనలపై రైతులు కన్నెర్ర జేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగు,తాగు నీరు, కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు ధర్నా చేపట్టారు. సాగుకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే కరెంట్ సరఫరా చేయాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Madhu Priya | మధుప్రియ ఇంట పెళ్లి సందడి..హల్దీ వేడుకలలో తెగ రచ్చ చేశారుగా..!
Gold rates | పసిడి ధర పరుగో.. పరుగు.. మళ్లీ పెరుగుతున్న బంగారం రేట్లు
PMKVY | పీఎం కౌశల్ వికాస్ యోజన అట్టర్‌ఫ్లాప్! పథకం లబ్ధిదారుల్లో 15% మందికే ఉద్యోగాలు