జూలపల్లి, ఆగస్టు 4 : పెద్దపల్లి జూలపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కోసం విరాళం అందజేయడానికి రిటైర్డ్ ఉద్యోగి భక్తి భావంతో ముందుకు వచ్చారు. ఈ క్రమంలో కోనరావుపేట గ్రామానికి చెందిన జెన్కో విశ్రాంత ఉద్యోగి మల్లారపు రాజనర్సయ్య అంజమ్మ దంపతులు సోమవారం రూ. 25, 116 నగదు అందించారు. అలాగే దాతలు గ్రామస్తులకు అన్నసంతర్పణ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ఆ దంపతులకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్, మాజీ సర్పంచ్ పొట్టాల మల్లేశం నాయకులు బెజ్జంకి రమేష్, వంగపల్లి వెంకటరమణ, మల్లారపు సంతోష్ కుమార్, సాయి కిషోర్, అర్చకుడు ఉద్దండ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.