Collector Sandeep Kumar | రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : కలెక్టర్ సందీప్ కుమార్
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు.
ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 10: రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. ఆదివారం సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని సాయిమణికంఠ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించి మాట్లాడారు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్‌కార్డు ప్రామాణికమైనందున అందరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
పేదలకు ఇచ్చే సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విధానంలో వన్ నేషన్, వన్ రేషన్ కార్డుతో పేదలు తమకున్న రేషన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ బియ్యం తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లె డీఎం రజిత, ఏఎంసీ చైర్మన్ సాబెరా బేగం, డీటీ మురళీ కృష్ణ, ఆర్ఐ శ్రవణ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

