సిరిసిల్ల టౌన్ మార్చి 14 : అసెంబ్లీ సమావేశాల నుండి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని(Jagadish reddy) సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే శాసనసభ సభ్యులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు.
పదేళ్లు సుభిక్షమైన పాలన అందించిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సైతం అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చక్రపాణి, గూడూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.