Chain Snatching | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహిళ కళ్లలో కారం కొట్టి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. బంజేరు గ్రామానికి చెందిన గుగులోతు హంసి శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఇంటి ముందు పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు ఆమె కళ్లలో కారం కొట్టారు. మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.