Thota Agaiah | పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలి.. మోడీ పాలనలో అచ్చే దిన్ ఇవేనా..!
రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోలు ధరలను లీటరు రూ.3 పెంచపడంపై తీవ్రంగా ఖండింస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రోలు, డీజీలు ధరలు పెంచడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు, చిరు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. మోడీ అచ్చే దిన్ అని చెప్పి అన్ని ధరలు పెంచుతున్నారని, ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగయ్య మండిపడ్డారు.

ఓవైపు ధరలు పెంచుతూనే.. ప్రధాని పొదుపు మంత్రం చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే పచ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను కేంద్రం కోలుకోలేని దెబ్బ తీసిందని ఆయన ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని.. ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనలో అన్నింటా
విఫలమయ్యారని అంజయ్య విమర్శించారు. డీజిల్, పెట్రోల్‌పై పెంచిన రూ.3ను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు,
నిరసనలు చేపడుతామని అంజయ్య హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

