సిరిసిల్ల రూరల్, మార్చి 06: మొగోడివైతే..కేటీఆర్‌తో కొట్లాడు. కేటీఆర్‌తో జిల్లా సుభిక్షం అయిందని, మతి భ్రమించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారాని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం తంగళ్లల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధు, మాజీ ఎంపీపీ పడిగెల మానసతో కలిసి మాట్లాడారు. జిల్లాలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో మిడ్ మానరు పూర్తి చేసి, మల్కపేట రిజర్వాయర్ నిర్మాణం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్ మానేర్ నింపి సాగుకు నీరందించారని పేర్కొన్నారు.
నీళ్లు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని మండిపడ్డారు. మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు నింపామని తెలిపారు. నీళ్లకోసం జిల్లెల్లలో ఓ కాంగ్రెస్ కార్యకర్త కేకే మహేందర్ రెడ్డికి ఫోన్ చేస్తే, మీ ఎమ్మెల్యేని అడుగు అని ఎగతాళి చేసిన వ్యక్తి కేకే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు తో తెలంగాణను సుభిక్షం చేశామని, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లో రంగనాయక సాగర్ కాలువలు కొన్ని పూర్తి కావాల్సి ఉంది. వాటినికి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేరని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఏం చేయలేక, కలెక్టర్‌ను తప్పు దోవ పట్టించి, అమాయక రైతులపై, బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. కేటీఅర్ పై అక్కసు తో కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లపై వ్యక్తిగతంగా నోరు జారితే సహించబోమని, బట్టలు ఊడదీసి తరుముతామని హెచ్చరించారు. ఈ సమావేశం లో ఫ్యా క్స్ వైస్ చైర్మన్ వెంకటరమణా రెడ్డి, కొయ్యాడ రమేష్, మహిమల మోహన్ రెడ్డి, కుర్మా రాజయ్య, బండి జగన్, శ్రీకాంత్ రావు, అమర్ రావు, కోడం సంధ్యారాణి, అనిల్ గౌడ్, మీసాల కృష్ణ, రామా గౌడ్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.