సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 21 : నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శివ భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడారు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా, శాసన మండల సభ్యుడుగా గొప్ప ప్రజాసేవ అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపల్లి ఆనందం, మాజీ బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, టిడిపి నాయకుడు మచ్చ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మోర రాజు, సామల రమేష్, మాజీ ఎంపిటిసి మచ్చ శ్రీనివాస్, కొడం రమేష్, బండి జగన్, అంకారపు మహేష్, పద్మశాలి సంఘ నేతలు పాల్గొన్నారు.