సిరిసిల్ల, మే 19: బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ సర్పంచ్ వల్లకొండ వేణుగోపాల రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మోతె మహేష్ యాదవ్‌లు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు ఆకాంక్షించారు. ఆదివారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో తంగళ్ళపల్లి సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కస్బెకట్కూర్ మాజీ సర్పంచ్ వల్లకొండ వేణుగోపాలరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మోతే మహేష్ యాదవ్‌ల జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
కేకు కటింగ్ అనంతరం వేణుగోపాల రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మోతె మహేష్ యాదవ్‌లను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు మాట్లాడుతూ.. నూరేళ్లు సుఖ సంతోషాలతో భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నేతలు, నాయకులు పుట్టిన రోజును పురస్కరించుకొని ఇద్దరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మండలాద్యక్షుడు గజబింకార్ రాజన్న, మాజీ సింగిల్ విండో ఛైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, కుంభాల మల్లారెడ్డి, మాట్లమధు, సర్పంచ్ల పోరం మండల అధ్యక్షుడు పూర్మాని రాజశేఖర్ రెడ్డి, చిలువేరి చిరంజీవి, నవీన్ రావు, శివజ్యోతి, మదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ కుమార్, అమర్ రావు,మహేష్ తదితర నేతలు పాల్గొన్నారు.