Beedi Workers | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 8 : బీడీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఏస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తంగళ్లపల్లిలోని బీడీ కంపెనీ ఎదుట బీడీ కార్మికులు నిరసస వ్యక్తం చేశారు. బీడీ కార్మికులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.4,000 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ అండగా ఉంటామని రూ. 4,000 జీవన భృతి ఇచ్చి ఆదుకుంటామని మేనిఫెస్టోలో చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.
గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పెద్ద ఎత్తున మహిళా బీడీ కార్మికులు ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమ బీడీ పరిశ్రమనేనని అన్నారు. దాదాపు తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.
కార్మికులు రోడ్డున పడే పరిస్థితి..
నెలలో 26 రోజులు నడవాల్సిన ఈ పరిశ్రమ కేవలం 10 రోజులే మాత్రమే నడుస్తుండటంతో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నదని వెంగల శ్రీనివాస్ అన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న బీడీ కార్మికులందరికీ గత ప్రభుత్వంలో కేసీఆర్ 2016 జీవన భృతి ఇచ్చి ఆదుకున్నారని అన్నారు. గత ప్రభుత్వం 2016 ఇస్తే మేము రూ.4,000 ఇస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.
బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి 2014 ఫిబ్రవరి 28లోపు ఉన్న కటాఫ్ తేదీని ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం ప్రహరీ గోడకే పరిమితమైన ఈఎస్ఐ హాస్పిటల్‌ను ఈ ప్రాంత ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ బద్దెనపల్లిలోని 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించి బీడీ కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్. బీఆర్టీయూ నాయకులు కొక్కుల ప్రసాద్, నాంపల్లి రామస్వామి, కొమురయ్య, జిందం రమేష్, మల్లేశంతోపాటు బీడీ కార్మికులు పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్