Bank Staff | కాలు కోల్పోయినా.. లోన్ కోసం కుటుంబాన్ని వదలని బ్యాంకు సిబ్బంది
Bank Staff | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో బోగం గోపాల్ అనే వ్యక్తి భార్య రామ, కొడుకు సాయికుమార్, కూతురు అమృతవర్షిణితో కలిసి నివసిస్తున్నాడు. గోపాల్ నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌లోని IKF ప్రైవేట్ బ్యాంకు నుండి రూ.8 లక్షలు లోన్ తీసుకున్నాడు.
Bank Staff | లోన్ తీసుకున్న ఓ వ్యక్తి ప్రతీ నెలా వడ్డీ కడుతున్నాడు.. అయితే ఇంకా నాలుగు ఈఎంఐలు మాత్రమే బ్యాంక్‌కు కట్టాల్సి ఉంది. లోన్ తీసుకున్న వ్యక్తి అనారోగ్యంతో కాలు కోల్పోయాడు. సదరు వ్యక్తి తనకు కొంత సమయం ఇవ్వాలన్నా ఓ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కనికరం చూపలేదు. ఆ వ్యక్తి కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో బోగం గోపాల్ అనే వ్యక్తి భార్య రామ, కొడుకు సాయికుమార్, కూతురు అమృతవర్షిణితో కలిసి నివసిస్తున్నాడు. గోపాల్ నాలుగేళ్ల క్రితం కరీంనగర్‌లోని IKF ప్రైవేట్ బ్యాంకు నుండి రూ.8 లక్షలు లోన్ తీసుకున్నాడు. మూడేళ్ల క్రితం గోపాల్‌కు షుగర్ వ్యాధి రావడంతో ఏడాది క్రితం డాక్టర్లు అతడి కాలు తీసేశారు. నిన్న మధ్యాహ్నం బ్యాంకు సిబ్బంది గోపాల్ ఇంటికి వచ్చి ఒకసారి బయటికి వెళ్తే తాళం వేసి వీడియో తీసుకుంటామని నమ్మించి, తాళం వేశాక నోటీసులు అంటించి వెళ్లిపోయారు.
కాలు పోయినా కూడా ప్రతి నెలా వడ్డీ కడుతున్నామని, ఒక నాలుగు ఈఎంఐలు మాత్రమే చెల్లించలేదని నాలుగు రోజుల క్రితం ఇంటికొచ్చిన బ్యాంకు సిబ్బందితో బాధితుడు గోపాల్ మొర పెట్టుకున్నా కనికరించకుండా కర్కశంగా వ్యవహరించారు. దీంతో గోపాల్ కుటుంబం రోడ్డున పడింది. స్థానికులు వారి కోసం టెంట్ వేయించగా, బంధువులు గోపాల్ పరిస్థితిని తెలుసుకుని ఎల్లారెడ్డిపేటకు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కొన్ని రోజులు సమయం ఇవ్వాలని ఎంత బతిమాలినా బ్యాంకు సిబ్బంది వినిపించుకోలేదని, బాధిత కుటుంబానికి కలెక్టర్ న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కర్కశత్వం
నాలుగు ఈఎంఐలు చెల్లించలేదని కాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని రోడ్డున పడేసిన సిబ్బంది
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో భార్య రామ, కొడుకు సాయికుమార్, కూతురు అమృతవర్షిణితో కలిసి నివసిస్తూ,… pic.twitter.com/6kISUSN4Dn
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2026
Read Also :
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్‌లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

