సిరిసిల్ల రూరల్, డి సెంబర్ 9 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంకారపు రవీందర్ మంగళవారం మండల కేంద్రం లో జోరుగా ప్రచారం చేశారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, మాజీ జడ్పిటిసి కోడి అంతయ్య, మాజీ ఎంపీపి పడిగెల మానసలతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు.
గ్రామంలో సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కేటీఆర్ సహకారం తో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. పెద్ద మనస్సుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు అంకారపు అనిత, కొడం సంధ్యారాణి, బీఅర్ఎస్ నేతలు పడిగెల రాజు, బండి జగన్, పర్కపల్లి తిరుపతి, రంగు ప్రసాద్, వెంగళ రమేష్, అనిల్, మహిళలు, తదితరులు ఉన్నారు.