సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 25: తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకోబుతున్నది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో రజతోతొత్సవ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో సిరిసిల్ల (Sircilla) పల్లెల్లో రజతోత్సవ శోభ ఊరూరా సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ జోష్ అందుకుంది. ఇప్పటికే కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో పార్టీ జెండా గద్దలను ముస్తాబు చేశారు. గులాబీ రంగులతో కొత్త శోభను పల్లెల్లో సంతరించుకుంది. ఉద్యమ స్ఫూర్తితో పార్టీ రజటోత్సవ సభకు సర్వం సిద్ధం అవుతుంది. ఇప్పటికే పార్టీ శ్రేణులకు రజతోత్సవ సభపై కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య.. మండల అధ్యక్షులతో ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందిస్తూ కేటీఆర్ ఆదేశాలను వివరిస్తూ సభకు సర్వం సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పల్లెకు ప్రత్యేక బస్సు, వాహనాలు ఏర్పాటుచేసి, వారికి భోజన వసతులు కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వాలంటీర్లు ఇన్చార్జీలను ఏర్పాటు చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రజితోత్సవ సభ ఎప్పుడు అంటూ ప్రజలే బిఆర్ఎస్ పార్టీ నేతలు అడుగుతూ, తాము వస్తామంటూ తెలపడం విశేషం.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి భారీగా..
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరంగల్ సభకు భారీగా ప్రజలు తరలిరానున్నారు. లక్ష్యానికి మించి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి మండలం తో పాటు గ్రామానికి ప్రత్యేక బస్సులు ఇతర వాహనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ సభ విజయవంతం పార్టీ నేతలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈనెల 27న పల్లెల్లోని ప్రతి గ్రామంలో , సిరిసిల్ల పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ జెండాలను ఎగురవేసి, వరంగల్ సభకు తరలి వెళ్ళనున్నారు.